BREAKING : పాలేరు నుంచి పోటీ చేస్తా – వైఎస్‌ షర్మిల

-

BREAKING : వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా అని.. ఖమ్మం జిల్లాకు గడప మన పాలేరు నియోజక వర్గమన్నారు. వైఎస్సార్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదని.. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉందని వెల్లడించారు.

ముఖ్యంగా వినిపిస్తున్న స్వరం పాలేరు నుంచి పోటీ చేయాలని… అడుగడుగునా హారతులు పట్టుకుంటూ ప్రతి గ్రామంలో అందరూ చెప్తున్నారని స్పష్టం చేశారు. పాలేరు నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు కాబట్టి దేవుడు తధాస్తు అంటాడు అని నా గట్టి నమ్మకమన్నారు. ఇవ్వాళ్టి నుంచి పాలేరు లో పోటీ చేయాలనేది మీ కోరిక కాదు…నా కోరిక కూడా అని పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్సార్ వారసత్వం కేవలం ఆయన బిడ్డగా నాకే ఉంది… ఇతర వ్యక్తి కి…ఇతర పార్టీ కి ఆ హక్కులేదన్నారు. వైఎస్సార్ మీద ఉన్న అభిమానం మన ఆస్తి అన్నారు షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version