ఏపీ రాజకీయాల్లో నిదానంగా ప్రతిపక్ష టీడీపీ పుంజుకుంటుందనే చెప్పాలి…ఈ మూడేళ్లలో పలు జిల్లాల్లో టీడీపీ పికప్ అయిందనే చెప్పాలి…చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు పాజిటివ్ పెరుగుతుంది…అదే సమయంలో వైసీపీ నేతలకు నెగిటివ్ పెరుగుతుంది…అయితే వైసీపీని డామినేట్ చేసే స్థాయి టీడీపీకి రాకపోయినా సరే…చాలావరకు మాత్రం టీడీపీకి ప్లస్ కనిపిస్తోంది. ఇదే పరిస్తితి ఎన్నికల వరకు కొనసాగితే…వైసీపీ-టీడీపీల మధ్య గట్టి పోటీ నడిచేలా ఉంది.
ఎన్నికల విషయం పక్కన పెడితే…ప్రస్తుతం విశాఖపట్నంలో కూడా టీడీపీకి కాస్త పాజిటివ్ కనిపిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో విశాఖ నగరంలో టీడీపీ సత్తా చాటింది…నగరంలోనే నాలుగు సీట్లు టీడీపీ గెలుచుకుంది. అయితే ఎంపీ సీటు మాత్రం స్వల్ప మెజారిటీతో ఓడిపోవాల్సి వచ్చింది. విశాఖ పార్లమెంట్ బరిలో బాలయ్య చిన్నల్లుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీ సీటు వైసీపీ ఖాతాలో పడింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక నగరంలోని అసెంబ్లీ సీట్లలో బలం పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
పైగా మూడు రాజధానుల పేరిట…విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించింది…దీంతో విశాఖలో టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది..కొందరు టీడీపీ నేతలు వైసీపీలోకి వచ్చారు. ఒకానొక సమయంలో బాబుని విశాఖ ఎయిర్ పోర్టు దాటి బయటకు రానివ్వలేదు. ఇక అలాంటి స్థితి నుంచి ఇప్పుడు విశాఖలో వైసీపీకి పోటీగా టీడీపీ వచ్చింది. రాజధాని పెట్టకపోవడం, నగరానికి పెద్దగా పెట్టుబడులు తీసుకు రాకపోవడం, అలాగే అక్రమాలు పెరగడం లాంటి అంశాలు వైసీపీకి మైనస్ అయ్యాయి.
ఇదే సమయంలో టీడీపీకి ప్లస్ అవుతుంది…ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ లో టీడీపీ బలపడుతుంది..నెక్స్ట్ ఎన్నికల్లో బాలయ్య చిన్నల్లుడుకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టీడీపీతో గాని జనసేన కలిస్తే విశాఖలో వైసీపీకి కష్టాలు మొదలైనట్లే.