ఒరేయ్ సుబ్బారావుల్లారా…. జగన్ సర్కార్ పై మరోసారి రెచ్చిపోయిన ఆర్జీవీ !

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, జగన్ సర్కార్ ల మధ్య టిక్కెట్ల ధరల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు పెంచాలని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డిమాండ్ చేస్తూ ఉంటే… ఏపీ ప్రభుత్వం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. టికెట్ల ధరలు పెంచాల్సిందేనంటూ… రాంగోపాల్ వర్మ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కి వరుస ట్వీట్స్ తో హడలు పుట్టించారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మరో సంచలన ట్వీట్ చేశారు రామ్ గోపాల్. టికెట్ల ధరలు పెంచడానికి సరైన ఉదాహరణ లు చెబుతూ ట్వీట్ చేశారు వర్మ.

“ఒరేయ్ సుబ్బారావు ల్లారా నేను అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి” అంటూ ట్వీట్ చేసిన వర్మ.. సినిమా టికెట్లను పెంచడానికి మూడు ఉదాహరాణాలను చెప్పారు.

“టికెట్ రేట్లు పెంచే వాడికి.. ప్రేక్షకుడికి ఇబ్బంది లేనప్పుడు.. ప్రభుత్వానికి నొప్పి ఏంటి ? విటుడికి, వేశ్యకు ఇబ్బంది లేనప్పుడు పోలీసులకు నొప్పి ఏంటి?.. లంచం ఇచ్చేవాడు కి పుచ్చుకునేవాడు ఇబ్బంది లేనప్పుడు ఏసీబీకి నొప్పి ఏంటి ? బ్లూ ఫిలిం తీసే వాడికి చూసేవాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్ళకి నొప్పి ఏంటి ? అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version