సుశాంత్ నా ఫ్లాట్ కి ఈఎంఐలు కట్టడం లేదు, నేనే కట్టుకుంటున్నా…!

-

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో ఇప్పుడు ఆర్ధిక వ్యవహారాలూ కీలకంగా మారాయి. సుశాంత్ సింగ్ ఆస్తుల విషయంలో హీరో గర్ల్ ఫ్రెండ్ జోక్యం ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈడీ ఈ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఈడీ ఈ కేసుని విచారించే క్రమంలోనే మరో విషయం బయటకు వచ్చింది. ముంబైలోని మలాడ్‌లో ఉన్న రూ .4.5 కోట్ల విలువైన ఫ్లాట్‌కు వాయిదాలు చెల్లిస్తున్నట్లు ఈడీ గుర్తించింది అనే వార్తలు వచ్చాయి.

Riya

ఈ ఫ్లాట్ నటి అంకితా లోఖండే ఆక్రమించినట్లు గుర్తించారు అనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై అంకితా స్పష్టత ఇచ్చింది. నా ఫ్లాట్ యొక్క రిజిస్ట్రేషన్ అలాగే నా బ్యాంక్ స్టేట్మెంట్ (01/01/19 నుండి 01/03/20) అని ఆమె ఆధారాలతో పోస్ట్ చేసింది. నా ఫ్లాట్ కి నేనే కట్టుకుంటున్నా… రిజిస్టర్ అయిన దగ్గరి నుంచి ఈఎంఐ నా ఖాతా నుంచే కట్ అవుతుందని ఆమె పోస్ట్ చేసింది. సుశాంత్ 403, అంకితా లోఖండే 404 ఫ్లాట్ లు కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version