పాకిస్థాన్ వేదికగా నిన్న ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు నేడు తమ మొదటి మ్యాచ్ దుబాయ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా బంగ్లా కెప్టెన్ బ్యాటింగ్ తీసుకోవడంతో.. టాస్ ఓడిన భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొత్తం ముగ్గురు పేసర్లు.. ఇద్దరు స్పినర్లతో వస్తుంటే.. టీమిండియా మాత్రం మొత్తం ముగ్గురు స్పినర్లతో బరిలోకి దిగుతుంది. కాబట్టి ఈ బౌలింగ్ అటాక్ తో బంగ్లాను రోహిత్ సేన ఎంత లోపి కట్టడి చేస్తుంది అనేది చూడాలి.
అయితే బంగ్లాతో మ్యాచ్ అదే భారత జట్టును చూస్తే.. రోహిత్ శర్మ(C), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.