పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన రిషబ్ శెట్టి..

-

కాంతారా చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరో రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం రిషభ్ శెట్టికి మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఈ సినిమా అనంతరం రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి వస్తారని వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చేసాడీ హీరో.

రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా రాబట్టింది. ముందుగా కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా తర్వాత అన్ని భాషల్లో మంచి హిట్ టాక్ సంపాదించుకుంది ఇది తెలుగు రాష్ట్రాల్లో సైతం కోట్లలో వసూలు సాధించడం చెప్పుకోదగిన విషయం. ఈ సినిమా విజయం అనంతరం ఈయన రాజకీయాల్లోకి వస్తారని వార్తలకు తాజాగా చెక్ పెట్టేసాడు ఈ హీరో. సోషల్ మీడియా వేదికగా చేసిన చిట్ చాట్ లో రిషభ్… తాను రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పాడు. తన సినిమాలను ఆదరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇప్పటికే కొంతమంది నన్ను ఫలానా పార్టీకి మద్దతుదారుగా ప్రొజెక్ట్ చేశారు. నేను రాజకీయాల్లోకి వెళ్లను!.. నన్ను రాజకీయాల్లోకి రావాలని మద్దతిస్తామని అభిమానులు కోరుతున్నప్పటికీ రాజకీయాల్లో అభిమానుల మద్దతు అవసరం లేదని తాను రాజకీయాల్లో ప్రవేశించానని స్పష్టం చేశారు. నా సినిమాలకు మద్దతు ఇవ్వండి చాలు. అది నాకు సరిపోతుందని చెప్పుకు వచ్చారు. ప్రస్తుతం తాను పూర్తి ఏకాగ్రత సినిమాలపైనే ఉంచానని మరిన్ని మంచి సినిమాలు అభిమానులకు అందించడమే తన ధ్యేయమని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version