హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల వల్ల హుస్సేన్ సాగర్‌కు వరద పెరుగుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 513 మీటర్ల వరకు నీరు చేరింది. ముఖ్యంగా బాలానగర్ నాలా నుంచి సాగర్లోకి ఇన్ ఫ్లో ఎక్కువగా వస్తుండటంతో నీళ్లు ఫుల్ ట్యాంక్ లెవల్‌కు చేరకుండా… వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు పంపేందుకు… అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తీసివేయించారు అధికారులు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాకినాడ దగ్గర తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో అలలు ఉధృతంగా ఎగిసి పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో నగరం తడిసి ముద్దవుతుంది.వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.