బీహార్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుబోతున్నాయి. ఆర్జేడీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను ఆరేళ్ల పాటు బహిష్కరించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయించుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ కారణంతోనే ప్రేమ చౌదరి, మహేశ్ ప్రసాద్ యాదవ్, ఫరాజ్ ఫాత్మీ లపై బహిష్కరన వేటు పడింది.
ఈ బహిష్కరణ ఆరేళ్ల పాటు కొనసాగుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అలోక్ మెహతా ప్రకటించారు. ఇకపోతే బహిష్కరణకు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు జేడీయూలో చేరుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు సీఎం నితీశ్ కుమార్ తో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల సమయంలో ఆర్జేడీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.