గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ఈ విషాద ఘటన నారా కోడూరు- బుడంపాడు గ్రామాల మధ్య సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం మృతులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.