Telangana State High Court building complex: తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.2,583 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవన సముదాయం నిర్మాణం కానుంది. 36.52 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టనున్నారట. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాలో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయనున్నారట. 8.4 లక్షల చదరపు అడుగుల్లో 6 అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం ఏర్పాటు చేయనుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్.

ఒకేసారి 2,800 కార్లు నిలిపేలా పార్కింగ్ సదుపాయం చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇక రూ.2,583 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవన సముదాయం నిర్మాణం కానున్న నమూనాను విడుదల చేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవన సముదాయం నిర్మాణం నమూనా వైరల్ గా మారింది.