ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు.. పలువురికి తీవ్ర గాయాలు !

-

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు సంచలనంగా  మారుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి కల్వర్టును గుద్దుకున్న బస్సు బోల్తా పడింది. కర్నూలు నుండి విజయవాడ వెళుతున్న బస్సు ఈ ప్రమాదానికి గురయినట్టు చెబుతున్నారు.

మరో పక్క బీహార్ లో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు – కారు డీ కొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టు చెబుతున్నారు.   మరో పక్క గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురం వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఇలా వరుస రోడ్డు ప్రమాదాలతో ఏపీ రోడ్లు రక్తసిక్తం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version