ఆ దేశంలో మనుషుల ఎముకలతో రోడ్డు నిర్మాణం..!

-

మనకు తెలిసినంత వరకు రోడ్డును కంకర, ఇసుక, డంబార్ తో కలిపి వేస్తారు. కానీ ఆ దేశంలో రోడ్డు నిర్మాణంలో మనుషుల ఎముకలు కూడా కనిపించాయి. వివరాల్లోకి వెళ్తే.. అది రష్యాలోని కిరెన్స్క్ ప్రాంతం. అక్కడి ప్రజలు కొత్తగా వేసిన రోడ్డుపై వెళ్తూ షాక్ కి గురైయ్యారు. ఆ వీధిలో మంచు కురుస్తూ… ప్రయాణాలకు ఇబ్బందిగా మారడంతో… ప్రజల కోసం వేసిన పార్టిశాన్ అలిమోవ్ స్ట్రీట్ రోడ్డు అది.

road

అయితే రష్యాలోని కిరెన్స్క్ ప్రాంతంలోని పార్టిశాన్ అలిమోవ్ స్ట్రీట్ రోడ్డుపై మనుషుల ఎముకలు, పుర్రె కనిపించాయి. రోడ్డు కోసం వేసిన కంకర, ఇసుక వంటి పదార్థాలతో మనుషుల ఎముకలను కూడా కలిపేసి వేసేశారు. ఈ ఎముకల్ని చూసిన స్థానికులు మనుషుల ఎముకలతో రోడ్డు వేయడమేంటి అనుకుంటూ భయాందోళనకు గురైయ్యారు. స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి పోలీసుల వరకు చేరాయి. వెంటనే పోలీసులు అలర్ అయ్యి దర్యాప్తు మొదలుపెట్టారు. అక్కడి ప్రాంతీయ మంత్రిత్వ శాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది.

ఇక ఇప్పటివరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆ ఎముకలు 100 ఏళ్ల నాటివని తెలుస్తోంది. 1917-1920 మధ్య రష్యా సివిల్ వార్‌ లో చనిపోయిన వ్యక్తివి కావచ్చని మెట్రో యూకే రిపోర్ట్ చేసింది. అవి మనిషి ఎముకలే అని క్లియర్‌ గా తెలిసినా.. అధికారులు మాత్రం నోరు విప్పడం లేదు. ప్రైవేట్ కాంట్రాక్టర్… రోడ్డు నిర్మిస్తున్నప్పుడు ఎముకలు రోడ్డుపై పడినా గమనించకుండా.. నిర్లక్ష్యంతో రోడ్డు వేసి ఉండొచ్చని తెలుస్తోంది.

ఆ ప్రాంతంలో అసలేం జరుగుతోంది. ఇది ఎంత భయంకరమైన ఘటన. నేను వివరించలేకపోతున్నాను. న్యాయ వ్యవస్థలు దీన్ని త్వరగా దర్యాప్తు చేస్తాయని అనుకుంటున్నాను” అని స్థానిక నేత నికొలాయ్ ట్రుఫనోవ్ అన్నారు. ప్రస్తుతం ఆ పుర్రెను ఎప్పటిది, ఎవరిది అన్నదానిపై నిపుణులు పరిశోధిస్తున్నట్లు తెలిసింది. ఎముకల్ని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ ‌కి తరలించారని రష్యా న్యూస్ ఏజెన్సీ ఇంటర్‌ ఫాక్స్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version