మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే భారత్ ఓటమి పాలైనప్పటికీ, కెప్టెన్ రోహిత్ శర్మ విరోచిత పోరాటానికిమాత్రం అభిమానులు ఫిదా అయిపోయారు.
ఒకవైపు బొటనవేలి గాయంతో బాధపడుతూనే ఆఖరి బంతి వరకు రోహిత్ అద్భుతమైన పోరాటపటిమ కనబడిచాడు. హిట్ మ్యాన్ తన సునామీ ఇన్నింగ్స్ తో బంగ్లా జట్టుకు చెమటలు పట్టించాడు. ఆఖరి బంతికి భారత విజయం సాధించాలంటే ఒక సిక్సర్ అవసరమైంది. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఐదు పరుగులు తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇక విరోషిత ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “రోహిత్ భయ్యా నీ ఇన్నింగ్స్ కు హ్యాట్సాప్, ఓడిపోయిన మాకు ఏ బాధ లేదంటూ” నెటిజెన్లు ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు.