గుజరాత్ ఎన్నికల్లో బిజెపి స్పష్టమైన ఆదిక్యంతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 120 కి పైగా స్థానాల్లో బిజెపి ఆదిక్యంలో ఉంది. బిజెపి నుంచి బరిలోకి దిగిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా (జామ్ నగర్ నార్త్), హార్దిక్ పటేల్ (వీరంగామ్) వెనుకంజలో ఉన్నారు.
ఒక వేళ ఇదే ట్రెండ్ కొనసాగితే, రవీంద్ర జడేజా భార్య రివాబా ఒడిపోయే ఛాన్స్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాద్వి కూడా వెనుకంజలో ఉన్నారు. అయితే పలు స్థానాల్లో ఆప్ ఓట్లు చీలుస్తోంది. కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.
కాగా 182 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికల్లో జరగకగా ప్రస్తుతం బిజెపి 128 స్థానాలలో ఆదిక్యం లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 45 స్థానాల్లో అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలలో అటు ఇండిపెండెట్స్ ఒక స్థానంలో ఆదిక్యం లో ఉన్నారు. గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మెజారిటీ మార్క్ 92 స్థానాలు కావాలి. కాగా గత 27 సంవత్సరాలుగా గుజరాత్ లో బిజెపి ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.