జూన్ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్ 2024 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వెస్టిండీస్ స్లో వికెట్ పిచ్లు విరాట్ కోహ్లికి సూట్ కావని బీసీసీఐ భావిస్తుందని,T20 ప్రపంచకప్ ఇండియా జట్టు నుంచి విరాట్ కోహ్లిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో T20 ప్రపంచకప్ లో చోటుపై విరాట్ కోహ్లికి.. కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు పలికినట్లు తెలుస్తోంది. జూన్లో జరగనున్న ఈ మెగా టోర్నీకి విరాట్ కోహ్లీ టీమిండియాలో ఉండాల్సిందేనని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బీసీసీఐ పెద్దలతో చెప్పినట్లు తెలుస్తోంది. పలువురు సెలక్టర్లు మూడో స్థానంలో ఇషాన్ను ఆడించాలని యోచిస్తుండగా రోహిత్ శర్మ మాత్రం కోహ్లి వైపు మొగ్గు చూపుతున్నారట. వరల్డ్ కప్లో విరాట్ స్థానంపై త్వరలోనే సెలక్టర్లు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.ఇక జూన్ 5వ తేదీన భారత్ తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో జరగనుంది.