తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పదేళ్లపాటు పాలించే అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వర్సిటీల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. వీసీలుగా అన్ని సామాజిక వర్గాల వారు ఉండాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.
వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. UGC ద్వారా వీసీల నియామకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.