ముంబై ఇండియన్స్ ఈ ఐపిఎల్ లో వరుసగా విఫలం అవుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయి.. అభిమానులను మరియు టీమ్ యాజమాన్యాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ముంబై ప్రతి సీజన్ లోనూ మొదట్లో ఫెయిల్ అయినా మధ్యలో పుంజుకుని టైటిల్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ అన్ని టీమ్ లు మ్యాచ్ లు గెలుస్తుంటే ముంబై ఇంకా బోణీ కొట్టలేదు. అయితే ఈ రోజు ఢిల్లీ మరియు ముంబై లు తలపడనుండగా తుది జట్టు ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా యంగ్ ప్లేయర్ డివాల్డ్ బ్రేవిస్ బెంచ్ కే పరిమితం అయ్యాడు.
రోహిత్ భాయ్… ఆ “చిచ్చరపిడుగు”ను టీం లోకి తీసుకో !
-