పొంగులేటి, జూపల్లి మాతో టచ్ లో ఉన్నారు.. భట్టి విక్రమార్క సంచలనం

-

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాతో టచ్ లో ఉన్నారని తెలిపారు భట్టి. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షకుపైగా మంది తరలివస్తారని తెలిపారు. ఇక సింగరేణిని ప్రైవేట్ పరం చేసే దుర్మార్గపు కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పెట్టే శక్తి ఉంటే బయ్యారంలో పెట్టు.. విశాఖ వద్దు.. బయ్యారం ముద్దు అని అన్నారు బట్టి.

సీఎం కేసీఆర్ ధరణి పేరుతో భూమిపై హక్కులు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ ను ఇలాగే వదిలేస్తే తెలంగాణను అమ్మేస్తారని అన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి కేసీఆర్ అని.. రాష్ట్రంలోని సంస్థలను కేసీఆర్ అమ్మకానికి పెట్టేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముంచేస్తున్న కేసీఆర్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి బిడ్ వేస్తామంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాలేశ్వరం వల్ల ముంపుకు గురికాకుండా రిటైనింగ్ వాల్ కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version