మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇక మ్యాచ్ అనంతరం తన గాయం గురించి రోహిత్ శర్మ అప్డేట్ ఇచ్చాడు. తన వేలికి ఫ్రాక్చర్ అయితే కాలేదని, ఎముక కాస్త జరిగినట్లు రోహిత్ తెలిపాడు. “నిజం చెప్పాలంటే చాలా నొప్పితోనే ఈ మ్యాచ్ బ్యాటింగ్ చేశాను. నా బొటనవేలు సరిగ్గా లేదు. వేలి ఎముక కాస్త పక్కకు జరిగింది. కొన్ని కుట్లు పడ్డాయి.
అయితే దేవుడు దయవల్ల ఫ్రాక్చర్ మాత్రం కాలేదు. అందుకే నేను బ్యాటింగ్ వచ్చాను. ప్రతి మ్యాచ్ లోను పాజిటివ్, నెగిటివ్ లు ఉంటాయి. కానీ 70 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఉన్నా బంగ్లాను 270 పరుగుల వరకు రానివ్వడం కచ్చితంగా బౌలర్ల విఫలమే అని” రోహిత్.