పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవడానికి విశాఖ అమ్మాయి కావాలి – రోజా

-

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అసలు ఇష్టం లేదని మంత్రి రోజా విమర్శించారు. ‘పవన్ కళ్యాణ్ కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి. షూటింగ్ లు చేసుకోవడానికి, ఆయన సినిమా కలెక్షన్లకు, నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి. చివరికి ఆయన పోటీ చేయడానికి గాజువాక కావాలి. కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడతామంటే వద్దు అంటున్నాడు అంటే విషయం అర్థమవుతోంది’ అని ఎద్దేవా చేశారు.

మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్న మమ్మల్ని పిచ్చి కుక్కలు అని టీడీపీ అంటోంది…వికేంద్రీకరణను అడ్డుకుంటున్న అచ్చ న్నాయుడు వంటి టీడీపీ వాళ్లే గజ్జికుక్కలు అంటూ నిప్పులు చెరిగారు.చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బినామీ అని.. చంద్రబాబు ఎప్పుడు సమస్యల్లో వున్నా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారని ఎద్దేవా చేశారు. కలెక్షన్లు, షూటింగ్ లు, కంటెస్టు చెయ్యడానికి వైజాగ్ కావాలి కానీ రాజధానిగా పనికి రాదా…? అని నిలదీశారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version