ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ 2024 లో రానున్న ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు. తాజాగా పర్యాటకశాఖ మంత్రి రోజా టీడీపీ మరియు చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. ఈమె మాట్లాడుతూ దమ్ముంటే టీడీపీ మరియు జనసేన నాయకులు ఇంటింటికీ వెళ్లి ఇంతకు ముందు ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని అడిగారు. రాష్ట్రానికి లాభం చేయకపోగా.. ఓటుకు నోటు అని అప్రజాస్వమ్య పనులను చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఫైర్ అయ్యారు.