ఆ మంత్రికి కౌంట‌ర్‌గా రోజా రాజ‌కీయం…?

-

చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజా గురించి నిత్యం ఏదో ఒక వార్త అటు ప్ర‌ధాన మీడియాలోనో లేదా సోష‌ల్ మీడియాలోనో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ప్ర‌స్తుతం క‌రోనా లాక్‌డౌన్‌లోనూ ఆమె గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ఓ పంపు ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే హోదాలో హాజ‌రైన ఆమె లాక్‌డౌన్‌లోనూ వంద‌ల మంది అనుచ‌రులు పాల్గొనేలా చేసుకున్నారు. అదే స‌మ‌యంలో పూలతో త‌ను న‌డుస్తున్న దారుల్లో అభిషేక్ చేసేలా మ‌హిళ‌ల‌ను నియ‌మించుకున్నార‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌చ్చాయి.

ఇక‌, ఆమె లాక్‌డౌన్ స‌మ‌యంలో పేద‌ల‌కు పంచుకున్న కూర‌గాయ‌లు, రేష‌న్ దుకాణాల‌కు వెళ్లి నిత్యావ‌స రాల‌ను పేద‌ల‌కు ఇస్తున్న‌తీరు కూడా మీడియాలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. నిజానికి మిగిలిన నియోజ‌క‌వ‌ర్గా ల్లోనూ ఇదే త‌ర‌హా సేవ‌లు కొన‌సాగుతున్నా.. ప్ర‌బుత్వం నుంచిపేద‌ల‌కు అన్ని ర‌కాల సేవ‌లు అందుతు న్నా.. ఎమ్మెల్యేలు ఎవ‌రూ కూడా ఇంత‌లా ప్ర‌చారం చేసుకోవ‌డం లేదు. దీంతో రోజా రాజ‌కీయంగానే వ్యూ హాత్మ‌కంగా ఇలా చేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. జిల్లాలో మంత్రిగా ఉన్న‌.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి కౌంట‌ర్‌గానే ఆమె ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

నిజానికి త‌న‌కు మంత్రి వ‌ర్గంలో సీటువ‌స్తుంద‌ని రోజా పైకి చెప్ప‌క‌పోయినా గ‌ట్టి ఆశ‌లే పెట్టుకున్నారు. కానీ, ఆమెకు జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేదు. అయితే, రెడ్డి సామాజిక వ‌ర్గానికే చెందిన పెద్దిరెడ్డికి అవ‌కాశం ఇచ్చారు. దీనివెనుక పెద్దిరెడ్డి త‌న‌ను తొక్కేస్తున్నార‌ని రోజా భావిస్తోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కంటే త‌న‌దే పైచేయి అని నిరూపించుకునేందుకు అనేక స‌మ‌యాల్లో త‌న చ‌ర్య‌లు వేగ‌వంతం చేస్తున్నారు. తాజాగా లాక్‌డౌన్ నేప‌థ్యంలోనూ రోజా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు ఈ వ్యూహంలో భాగ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, పెద్దిరెడ్డి వ‌ర్గం రోజా వ్యూహానికి ప‌డిపోతుందా?  లేదా? అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version