ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రౌడీ షీటర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధిత వ్యక్తి ఆరోపించారు. ఓ కేసులో సత్తెనపల్లి సీఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర డబ్బులు డిమాండ్ చేశారని రౌడీ షీటర్ ఖాశిం సైదు ఆరోపించారు.
డబ్బులు ఇవ్వాలని ఫోన్‌లో రైటర్ రవీంద్ర డిమాండ్ చేశాడనని ఓ ఆడియో కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నం చేసిన రౌడీ షీటర్ ఖాశిం ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, దీనిపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
పల్నాడు-సత్తెనపల్లిలో రౌడీ షీటర్ ఆత్మహత్యాయత్నం!
పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు
ఓ కేసులో సత్తెనపల్లి సీఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించిన రౌడీ షీటర్ ఖాశిం సైదు
డబ్బులు ఇవ్వాలని ఫోన్‌లో రైటర్ రవీంద్ర డిమాండ్ చేస్తున్నట్టు ఓ… pic.twitter.com/28f0a6ZCN2
— BIG TV Breaking News (@bigtvtelugu) April 15, 2025