తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడతారు. ముఖ్యంగా పెంపకంలో ఎటువంటి తప్పులు చేయకుండా చూసుకుంటారు మరియు పిల్లల చదువు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కాకపోతే వారిలో ఆత్మవిశ్వాసం చదువుతో పాటుగా రాదు. దీంతో భవిష్యత్తులో పిల్లల జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే వారి అభివృద్ధి కోసం ఎన్నో జాగ్రత్తలు చెప్పాలి. ముఖ్యంగా కోపం రాకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. ప్రశాంతంగా మాట్లాడి అన్ని విషయాలను తెలియజేయడం వలన ఎంతో సురక్షితంగా భావిస్తారు. పైగా ఇటువంటి అభివృద్ధి ఉండడం వలన సొంత నిర్ణయాలు తీసుకునే ఆలోచన ఉంటుంది.
ముఖ్యంగా ఏ సందర్భంలో అయినా తప్పులు చేయడం మరియు వాటిని గుర్తించుకుని నేర్చుకోవడం ప్రతి ఒక్కరిలో అవసరం. కనుక పిల్లలకు ఎప్పుడు స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశాలను ఇవ్వాలి. ఇలా చేస్తే ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తారు. చాలా శాతం మంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పే మాటలను అస్సలు లెక్కచేయరు. కాకపోతే పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటలను వినాలని కోరుకుంటారు. కనుక కచ్చితంగా పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు తప్పకుండా వినాలి. ఇలా చేయడం వలన వారి ఆలోచనలు కూడా తెలుస్తాయి. ఈ విధంగా చెప్పింది వినడం వలన ప్రతి విషయాన్ని భయం లేకుండా తెలియజేస్తూ ఉంటారు.
అంతేకాకుండా వారు చెప్పేది తల్లిదండ్రులు నమ్మాలి. ఇలా కొంతవరకు స్వేచ్ఛను ఇచ్చి వారు చెప్పింది వినడం వలన ఎంతో మంచి మార్పు వస్తుంది. తల్లిదండ్రులు సహజంగా పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపరు. కాకపోతే పిల్లలు తల్లిదండ్రులతో ఎంతో సమయాన్ని గడపాలని కోరుకుంటారు. వారితో కలిసి భోజనం చేయడం, ఆటలు ఆడడం, వాకింగ్ కు వెళ్లడం వంటి మొదలైన పనులను చేయడం వలన వారు ఎంతో ఆనందంగా ఉంటారు. పిల్లలను పెంచేటప్పుడు ఇతరులతో పోల్చడం వలన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మరియు మానసికంగా ఎంతో ఒత్తిడిని తీసుకుంటారు. ఈ విధంగా ఇతరులతో పోల్చడం సరైన పద్ధతి కాదు.