హోటల్ యజమానిపై కర్రలతో దాడి.. వీడియో వైరల్

-

యూపీలో దారుణం చోటుచేసుకుంది. లఖింపుర్ ఖేరీ జిల్లాలో జగదీశ్ కుమార్ అనే హోటల్ యజమానిపై పలువురు దాడికి పాల్పడ్డారు. హోటల్ వద్దకు వచ్చిన దుండగులు ముందుగా జగదీశ్‌తో గొడవపడ్డారు.

అనంతరం ఒక్కసారిగా కర్రలతో అతడిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.విచక్షణా రహితంగా దాడి చేయడంతో దెబ్బలకు యజమాని తాళలేకపోయాడు. పాతకక్షల కారణంగానే వీరంతా గొడవకు దిగినట్లు తెలుస్తోంది. బాధితుడు ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ విజువల్స్ నెట్టింట వైరలవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news