ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల బాహుబలి రికార్డులను చెరిపివేసింది ట్రిపుల్ ఆర్. అయితే కలెక్షన్ల పరంగా 1000 కోట్లకు చేరువలో ట్రిపుల్ ఆర్.. ఒవరాల్‌గా బాహుబలి రికార్డ్స్‌ను బద్దలు కొడుతుందా.. అంటే ఖచ్చితంగా చెప్పలేమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రంలో సంగీతం కూడా ప్రధానమైనదని చెప్పొచ్చుఎం.ఎం.కీరవాణి అందించిన మ్యూజిక్ మూవీని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.
చిత్ర సన్నివేశాలను ఇంకా హైలైట్ చేయడంతో పాటు ప్రేక్షకులలో భావోద్వేగం కలిగించింది సంగీతం.ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRR ఫిల్మ్ చూస్తున్న క్రమంలో ప్రేక్షకులు సీటు అంచున ఉండేలా సంగీతం డిజైన్ చేశారు కీరవాణి. అయితే ఈ సినిమా OST ( ఒరిజినల్ సౌండ్ ట్రాక్) ను మరో నెల రోజుల్లో విడుదల చేస్తామని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తాజాగా చెప్పారు.అలాగే “కొమ్మా ఉయ్యాల” బిట్ సాంగ్ ను కూడా రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.