“ఆర్ఆర్ఆర్” ఫాన్స్ కు బిగ్ షాక్ : మూవీ రిలీజ్ కు బ్రేక్ !

ప్ర‌పంచ‌మంతా ఎంత‌గానో ఎదురు చూస్తున్న ప్ర‌ముఖ మూవీ ఆర్ఆర్ఆర్. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీస్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు ఆక‌శాన్ని తాకుతున్నాయి. ఇక ఇందులో తొలిసారి ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, పోస్ట‌ర్లు భారీ హైప్ ను పెంచేశాయి. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ బృందం. ఈ మేరకు ట్వీట్టర్ వేదికగా పేర్కొంది ఆర్ఆర్ఆర్ మూవీ బృందం. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తయిందని.. కానీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అయితే విడుదల తేదీని మాత్రం ఫైనల్ చేయలేదని.. త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది ఆర్ఆర్ఆర్ మూవీ బృందం. సాధ్యమైనంత త్వరలో సినిమా ను విడుదల చేస్తామని…థియేటర్లలోనే విడుదల చేస్తామని పేర్కొంది. కాగా మొదట్లో  అక్టోబర్ 13 న విడుదల చేయాలని చిత్ర బృందం అనుకున్న సంగతి తెలిసిందే.