RRR : ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వ‌స్తున్నవిష‌యం తెలిసిందే. అంత స‌క్ర‌మంగా ఉంటే ఈ సినిమా ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను క్రియేట్ చేసి ఉండేది. కానీ క‌రోనా వ్యాప్తి వ‌ల్ల ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా వాయిదా త‌ర్వాత మ‌ళ్లీ ఎప్పుడు విడుద‌ల చేస్తారా.. అని అభిమానులు వేయి క‌ళ్ల తో ఎదురు చూశారు. కాగ ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులకు చిత్ర బృందం ఎట్ట‌కెల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.

ఆర్ఆర్ఆర్ సినిమాను ఈ ఏడాది మార్చి నెల 18 వ తేదీన విడుద‌ల చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని చిత్ర బృంధం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఒక వేళ ఈ తేదీకి సాధ్యం కాకుంటే.. ఏప్రిల్ 28న త‌ప్ప‌కుండా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. కాగ ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి విప‌రీతంగా ఉంది. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల‌లో థీయేట‌ర్లు 50 శాతం ఆక్యూపెన్సీతో న‌డుస్తున్నాయి. మ‌రి కొన్ని రాష్ట్రాల‌లో థీయేట‌ర్లు మూతప‌డే అవ‌కాశం ఉంది.

 

అయితే దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి పూర్తిగా తొల‌గిపోయిన త‌ర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ప్ర‌క‌టించింది. అలాగే థీయేట‌ర్లపై ఎలాంటి ఆంక్ష‌లు లేని స‌మ‌యంలోనే విడుద‌ల అవుతుంద‌ని తెలిపారు. అయితే ఈ ఏడాది మార్చి నెల వ‌ర‌కు క‌రోనా వ్యాప్తి ఉండ‌ద‌ని చిత్ర బృందం భావిస్తుంది. అందు కోసమే.. ఈ ఏడాది మార్చి నెల 18 లేదా 28 తేదీల‌లో ఆర్ఆర్ఆర్ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version