దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఎన్టీఆర్, రాంచరణ్ ల తో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవంగా ఈ జూన్ లేదా జూలై లో ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయాలనుకున్నారు చిత్ర యూనిట్. కాని గ్రాఫిక్స్ వర్క్, సీ.జి వర్క్ కంప్లీటవక పోవడం తో వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేస్తామని అఫీషియల్ గా రాజమౌళి అనౌన్స్ చేశారు.
అయితే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ పోస్టర్ రాంచరణ్ పాత్ర కి సంబంధించిన టీజర్ తో మరోసారి ఇండస్ట్రీకి భారీ హిట్ ఇవ్వబోతున్నారన్న టాక్ మొదలైంది. అంతేకాదు అదే నమ్మకంతోను ఉన్నారు. ఇక ఎన్.టి.ఆర్ పాత్రకి సంబంధించిన టీజర్ కూడా రెడీ అవుతోంది. ఈ టీజర్ ని ఎన్.టి.ఆర్ బర్త్ దే కి రిలీజ్ చేయనున్నారు. అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధిచిన ఏదో ఒక అప్‌డేట్ వస్తూనే ఉంటుందని తాజా సమాచారం. అంటే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు అని అర్థం. ఇక ఇప్పటికే 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా 800 కోట్ల వరకు వసూళ్ళని సాధించబోతుందని ఆ దిశగానే రాజమౌళి ప్లాన్ వేసుకుంటు వస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ఆర్ ఎఫ్ సి లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. అంతేకాదు రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఓ వైపు నుండి చేసుకుంటు వస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలకి “వీఎఫ్ఎక్స్” వర్క్ అప్పగించారు. ఈ టీం అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ గా కంప్లీట చేస్తున్నారట. మరో డబ్బింగ్ కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారట. లాక్ డౌన్ ఎత్తేయగానే 24/7 వర్క్ చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో 2021 జనవరి 8 న సినిమా రిలీజ్ చేయడమే లక్ష్యం గా పెట్టుకున్నారట రాజమౌళి.