ఆర్‌ఆర్‌ఆర్‌ను అడ్డుకుంటున్న జేమ్స్‌బాండ్‌

-

ఆర్‌ఆర్‌ఆర్‌ అక్టోబర్‌ 8న రిలీజ్‌ అంటూ.. అందులో నటించిన హాలీవుడ్‌ నటి అలిసన్ డూడీ రివీల్‌ చేసేసింది. సినిమా రిలీజ్‌ విషయంలో రాజమౌళి ముందు రెండు ఆప్షన్స్‌ వున్నాయి అందులో ఒకటి అక్టోబర్‌ 8 కాగా.. రెండోది 2022 జనవరి 7. అక్టోబర్‌ 8న రిలీజ్‌ చేయడానికి జక్కన్న ముందు మరో ఛాలెంజ్ ఉందట…

ఆర్ఆర్ఆర్‌ మూడేళ్లనుంచి సినీ ప్రియులే కాకుండా.. అందరి మనసుల్లో తిరుగూ వుంది. ఇంకా ఎక్కువ తిరిగినా ప్రమాదమే. ఆలస్యమైతే.. సినిమాపై ఇంట్రెస్ట్ పోతుందన్న కారణంతో.. దసరా పంగ కలిసొచ్చేలా అక్టోబర్‌ 8న రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే.. అదే రోజు హాలీవుడ్‌ మోస్ట్ ఎవేటింగ్‌ బాండ్‌ మూవీ ‘ నో టైం టు డై’ రిలీజ్‌ చేస్తున్నారు. కరోనాతో వాయిదాపడ్డ ఈ బాండ్‌ సినిమాను ఏప్రిల్లో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తితో రిలీజ్‌ అక్టోబర్‌ 8 నాటికి వెళ్లిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో బాండ్‌ మూవీ ప్రభావం ఆర్‌ఆర్‌ఆర్‌పై పెద్దగా వుండకపోవచ్చు. అయితే.. మెట్రో సిటీ ఆడియన్స్‌ బాండ్‌ మూవీ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌పై ఎఫెక్ట్‌ ఎక్కువ వుంటుంది. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా అంటే.. అదొక ఇంటర్నేషన్‌ మూవీ అయిపోయింది. చైనా… జపాన్‌లో కూడా ఒకేసారి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను డబ్ చేయకపోయినా.. సబ్‌ టైటిల్స్‌తో చూసే ఆడియన్స్‌ వున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి వస్తేమాత్రం.. ఓవర్సీస్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ వర్సెస్‌ బాండ్‌గా మారుతుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓవర్సీస్‌ బిజినెస్‌ ఇప్పటికే జరిగిపోయింది. 60 కోట్లకు పైగా పలికింది. అయితే.. ఓవర్సీస్‌లో గతంలో మాదిరి థియేటర్స్‌కు జనం రావడంలేదు. ఈక్రమంలో 2022 జనవరికి వెళ్లిపోదామా? అన్న ఆలోచన కూడా ఆర్‌ఆర్ఆర్‌ టీం వుంది. పరిస్థితులు మున్ముందు సానుకూలంగా వుంటే.. దసరాకే వస్తారు. ఓవర్సీస్‌తో సంబంధం లేకుండా… రావాలనుకుంటే.. డిస్ట్రిబ్యూటర్స్‌కు కొంత డబ్బులు వెనక్కి ఇచ్చేయాల్సి వుంటుందట. ఇలా.. ఆర్ఆర్‌ఆర్‌ రిలీజ్‌ చాలా విషయాలతో ముడిపడి వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version