శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.12 లక్షల మద్యం సీజ్..

-

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు లక్షల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నారు. నాన్ డ్యూటీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని వారిపై కస్టమ్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఇటీవల గోవాకు వెళ్లిన 12 మంది వ్యక్తులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా అనుమానం వచ్చిన పోలీసులు వారి లగేజీని చెక్ చేయగా సుమారు మొత్తం 415 మద్యం బాటిళ్లు లభ్యం అయ్యాయి. వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.12 లక్షలకు పైగానే ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.అనంతరం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మద్యం తరలిస్తున్న వారిపై కేసులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇధిలాఉండగా, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవలి కాలంలో మాదకద్రవ్యాలు, బంగారం అక్రమ స్మగ్లింగ్ పట్టుబడుతున్న ఘటనలు అనేకం పెరిగిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version