రూ.70 కోట్లు.. 15 నిమిషాల్లో ఎంత లెక్కిస్తే అంత మీ సొంతం.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్

-

తమ ఉద్యోగులకు ఓ చైనా కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. వార్షిక బోనస్ కింద రూ.70 కోట్లు ప్రకటించింది.అంతటితో ఆగకుండా వారికి ఓ టాస్క్ ఇచ్చింది. రూ.70 కోట్లను ఓ పొడవాటి టేబుల్ మీద పరిచింది. 15 నిమిషాల్లో ఉద్యోగులు ఎంత త్వరగా డబ్బులు లెక్కిస్తారో.. ఆ అమౌంట్ మొత్తం వారికే అని ప్రకటన చేసింది.

చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ తమ కంపెనీ ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60 నుంచి 70 మీటర్ల టేబుల్‌పై ఈ మొత్తాన్ని ఉంచి ఉద్యోగులను 30 టీమ్స్‌గా డివైడ్ చేసింది. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే వచ్చి 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో అంత ఆ టీమ్ తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2023 జనవరిలోనూ ఇదే విధంగా హెనన్ మైన్ క్రేన్ సంస్థ తమ ఉద్యోగులకు రూ.70 కోట్ల బోనస్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version