సోషలిస్టు, సెక్యులర్ పదాలను తొలగించడంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-

భారత రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్‌’ (లౌకికవాద) అనే పదాలను తొలగించడమంటే దేశం అనాగరిక వ్యవస్థలోని మతమౌఢ్యంలోకి వెళ్తున్నట్లే అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దేశ పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, మతం, ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగ పీఠికలో లిఖితపూర్వకంగా పేర్కొనబడ్డాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడానికి మతతత్వ శక్తులు పన్నుతున్న కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పీఠికలో ఉన్న ‘సోషలిస్టు’, ‘సెక్యులర్‌’ పదాల తొలగింపును బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.

సిద్దిపేట గడ్డ మీద నుండి బహుజన దండయాత్ర ప్రారంభిస్తున్నట్లు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేటలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్​చార్జి పుల్లూరు ఉమేశ్​ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘బీఆర్ఎస్ లో బహు జనులు జెండాలు మోసేందుకే పనికొస్తారా? రాజ్యాధికారానికి పనికిరారా?’ అని ప్రశ్నించారు. ఈ సమావేశంతో దొరల గడీల మీద బహుజన దండయాత్ర ప్రారంభిస్తున్నామని, ఆనాటి దొరల మూలాలు ఈనాటి దొరలకు ఉన్నాయని, నారాయణ్​ఖేడ్ లో మూడు కుటుంబాలే 50 ఏండ్లుగా ఏలుతున్నాయన్నారు. తెలంగాణ కోసం మనమందరం త్యాగాలు చేస్తే కేసీఆర్ ఒక్కడే సీఎం అయ్యాడని, ప్రవీణ్ కుమార్ సీఎం అయితే బహుజనులంతా అయినట్లేనని, బహుజన పార్టీ కండువా వేసుకొని, ప్రగతి భవన్ లో చాయ్​ తాగుదామన్నారు. కేసీఆర్ తన ఫాంహౌజ్ కోసం సొంతంగా మార్కూక్ మండలాన్నే ఏర్పాటు చేసుకుని, అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టించి, ఫాంహౌజ్ కు24 గంటల కాపలా పెట్టుకున్నాడన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version