ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా : అరిందమ్‌ బాగ్చి

-

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య ప్రస్తుతం చెలరేగిన దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఆ దేశ పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్‌లో చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయి. అయితే ఈ వివాదంపై కెనడా తీరును ఎండగడుతూ కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగానే కెనడా వాసులకు భారత్ వచ్చేందుకు వీసాలు నిలిపివేసిన విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

అయితే, తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి కెనడాపై గురువారం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని ట్రుడో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని కొట్టిపడేశారు. నిజ్జర్‌ హత్య వ్యవహారంలో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని ట్రుడో చేసిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కెనడాలో జరుగుతున్న వ్యవహారాలపై భారత్‌ అనేక లిఖిత పూర్వకంగా పత్రాలను సమర్పించిందని, అక్కడ ఆశ్రయం పొందుతున్న ఖలిస్తాన్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. భద్రతా సమస్యల కారణంగా వీసా సేవలకు ఆటంకం ఏర్పడిందని, దీంతో భారత హైకమిషన్ , కాన్సులేట్‌లు తాత్కాలికంగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయలేకపోయాయని తెలిపారు. కెనడియన్‌ పౌరులు వీసా సేవలు పొందలేరని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీసా సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version