ప్రేమ్ సాగర్ రావు గూండా ఇజం చేస్తున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట, వేంపల్లి గ్రామ సరిహద్దులో సుమారు 276 ఎకరాలలో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులను పరామర్శించారు BRS పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గూండా ఇజం చేస్తున్నారు అని పేర్కొన్నారు.

ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజల భూములను ఇలాంటి నోటిఫికేషన్లు, జీవోలు లేకుండా గుంజుకుంటున్నారు. మంచిర్యాలలో మీడియా పై బహిరంగంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కాంగ్రెస్ నాయకుల భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మించాలి. పేద దళిత వర్గాలకు చెందిన రైతుల భూముల్లో ఎలా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తారు అని ప్రశ్నించారు. ఇక రేవంత్ పాలనలో ఎస్సీలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దళితుల భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదు.. బాధితుల వెంట కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు అని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version