ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తను నిర్దోషినని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ రఘనందన్ రావు సవాల్ విసిరారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసినందున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉండి మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు పోలీసులు మంచిగా కనిపించరని విమర్శించారు.
గతంలో పలు వేదికలపై తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమని పెద్ద పెద్ద స్పీచులు ఇచ్చారని, అప్పట్లో ప్రతిపక్ష నేతలను అదే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఇప్పుడు అదే పోలీసులు కేటీఆర్ వరకు వచ్చే సరికి తనకు పోలీసులపై నమ్మకం లేదంటూ అర్థం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఫార్ములా ఈ-కారు కేసును లొట్టపీసు కేసు అని మాట్లాడిన కేటీఆర్.. ఇప్పుడెందుకు పోలీసులను చూస్తే భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. ఏ తప్పు చేయకపోతే.. సరైన అధారాలు చూపించి నిర్దోశిగా ప్రూవ్ చేసుకోవాలన్నారు.