బీఎస్పీ తెలంగాణ అధ్య‌క్షుడిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-

ఐపీఎస్ ఉద్యోగానికి వాలంట‌రీ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి రాజకీయాల్లోకి వ‌చ్చిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు ప్ర‌మోష‌న్ ద‌క్కింది.
రాజ‌కీయాల్లోకి వ‌స్తూ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరిన ఆయ‌న‌ను పార్టీ అధినేత్రి మాయావ‌తి నాడు తెలంగాణ శాఖ‌కు క‌న్వీన‌ర్‌గా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ హోదాలోనే ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలంగాణ‌లో పాద‌యాత్ర చేప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు ప్ర‌మోష‌న్ క‌ల్పిస్తూ బీఎస్పీ గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బీఎస్పీ తెలంగాణ శాఖ‌కు ఆయ‌న‌ను అధ్య‌క్షుడిగా నియ‌మించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జీగా కొన‌సాగుతున్న ఆ పార్టీ ఎంపీ రాంజీ గౌత‌మ‌న్ హాజ‌రుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version