ఇటీవలే.. తన పదవికి రాజీనామా చేసిన.. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్… రాజకీయ రంగ ప్రవేశానికి అన్ని కసరత్తలు చేసుకుంటున్నారు. ఆయన.. స్వచ్చంధ పదవీ విరమణ తీసుకున్న తర్వాత.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీలో చేరతారని… అంతేకాదు.. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటారని జోరుగా ప్రచారం సాగింది.
అయితే.. వాటిన్నిటిని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే ఖండించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్… జాతీయ పార్టీ అయిన బీఎస్పీ వైపుగా వెళుతున్నారని కూడా ఆయన శిబిరంలో చర్చ జరిగింది. అయితే… తాజాగా ఆ వార్తలన్నియూ నిజమని తేలిపోయింది. ఇవాళ జాతీయ మీడియాతో మాట్లాడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కాన్షీరాం అడుగు జాడల్లో నడిచేందుకు తెలంగాణకు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్.. బీఎస్పీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. అంతేకాదు.. అతి త్వరలోనే బీఎస్పీ పార్టీలో చేరతారని ఆమె ప్రకటించారు.