అయోధ్య తీర్పుపై మోహన్ భగవత్ రియాక్ష‌న్‌..

-

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ క్ర‌మంలోనే అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్వాగతించారు. ఈ తీర్పు ఏ ఒక్కరి విజయమో..ఓటమో కాదని వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు పట్ల అందరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలి. మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఎలాంటి సమస్య ఉండబోదు.

దేశ అత్యున్నత న్యాయస్థాన తీర్పును అనుసరిస్తాం. భారతీయులను హిందు, ముస్లింలు అంటూ రెండు వర్గాలు చూడబోము’ అని తెలిపారు. అలాగే ‘సుప్రీం తీర్పు చారిత్రాత్మకం. మతాలు వేరైనా మనమంతా రాముడి వారసులమే. ఇక అయోధ్య వివాదాలన్నీపరిష్కారమైనట్లే. దేశంలో శాంతి కొనసాగాలి. శాంతి, సామరస్యాలు నెలకొనేలా మీడియా వ్యవహరించాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలి’ అని రాందేవ్ బాబా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news