తండ్రి అప్పు తీర్చలేదని 8వ తరగతి కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి

-

తండ్రి అప్పు తీర్చలేదని ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తెను కిడ్నాప్ చేశారు వ్యాపారి. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మువ్వావారిపాలేనికి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులకు తిరుపతి వలస వెళ్లిన సమయంలో.. అక్కడ ఆర్. ఈశ్వర్ రెడ్డి వద్ద రూ.5 లక్షలు అప్పుతీసుకున్నాడు శ్రీనివాసరావు.

There is intense tension over the kidnapping of Indians in Mali
Businessman kidnaps 8th grade daughter after father fails to repay loan

దీంతో ఆ బాకీ చెల్లించకపోవడంతో శుక్రవారం చీమకుర్తి వచ్చిన ఈశ్వర్ రెడ్డి నేరుగా శ్రీనివాసరెడ్డి కుమార్తె చదువుకునే పాఠశాల వద్దకు వెళ్లి అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై బయటకు వస్తున్న ఆ బాలికకు.. మీ నాన్న ఇంటికి తీసుకురమన్నాడంటూ మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకున్నాడు ఈశ్వర్ రెడ్డి. స్వీట్లు కొనిస్తానని చెప్పి దారిమళ్లించి ఒంగోలుకు తీసుకువచ్చాడు ఈశ్వర్ రెడ్డి.

అక్కడి నుంచి శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మీ కుమార్తెను తీసుకెళుతున్నా.. నాకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వకపోతే చంపేస్తా అని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు శ్రీనివాసరావు. సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్ తిరుపతికి చెందిన ఆర్. ఈశ్వర్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news