యాదాద్రి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండి సజ్జనార్. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపద్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండ పైకి యాదాద్రిదర్శిని పేరుతో బస్సుల ఏర్పాటు చేసింది ఆర్టీసీ.
యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి జిల్లా జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ నుండి మినీ బస్సులు అందుబాటులో ఉంటాయని సజ్జనార్ పేర్కొన్నారు. జెబిఎస్ నుండి 100 రూపాయలు. ఉప్పల్ నుండి 75 రూపాయలు. ప్రతి రోజు 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇతర జిల్లాల నుండి ప్రత్యేక యాదాద్రి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని.. ప్రైవేట్ వాహనాలకంటే ఆర్టీసీ బస్సుల్లోనే సుఖవంత ప్రయాణమన్నారు. వీఆర్ఎస్ ఉద్యోగులు కొంత మంది కోరుకుంటున్నారు..బలవంతంగా మేము వీఆర్ఎస్ ఇవ్వటం లేదని చెప్పారు..