రిలీజ్ కు సిద్ధమైన `రుద్రంకోట‌` మూవీ

-

 

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `రుద్రంకోట‌`. ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ నెల‌లో స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

 

ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండ‌వ‌ల్లి మాట్లాడుతూ…“ శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమ‌కథా చిత్ర‌మిది. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర రుద్రంకోట అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల సెన్సార్ ప్ర‌ముఖులు యుబైఏ స‌ర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్ర‌శంసించారు. మా సినిమా న‌చ్చ‌డంతో స్క్రీన్ మాక్స్ వారు గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చారు. ఆగ‌స్ట్ లో సినిమాను విడుద‌ల చేయ‌నున్నాం“ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news