అన్నదాత సుఖీభవ పథకం! దీపావళికి నేరుగా నగదు పొందనున్న రైతు పూర్తి వివరాలు..

-

మీ పంట పొలాల్లో పడిన శ్రమకు తగిన ఫలితం అందబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 47 లక్షల మంది రైతులకు ఈ దీపావళి మరింత వెలుగునివ్వనుంది. రైతన్నల పెట్టుబడి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులు త్వరలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి ఈ మొత్తం రైతన్నలకు నేరుగా అందడం వల్ల పండుగ సమయంలో ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. మరి ఈ పథకం పూర్తీ వివరాలు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా మొత్తం రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.14,000 కాగా కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) ద్వారా రూ. 6,000 సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని సంవత్సరంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

మొదటి విడత నిధులు ఇప్పటికే ఆగస్టు 2, 2025న విడుదలయ్యాయి. ఇందులో రాష్ట్ర వాటా రూ.5,000 కేంద్ర వాటా రూ. 2,000 కలిపి మొత్తం రూ. 7,000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీపావళి కానుకగా రెండో విడత నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండో విడతలో కూడా రైతులకు మొత్తం రూ. 7,000 అందే అవకాశం ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా (అన్నదాత సుఖీభవ) రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం వాటా (పీఎం-కిసాన్ 21వ విడత) రూ.2,000, ఇక మొత్తం రైతుకు ₹7,000 అందనున్నాయి.

 

Annadata Sukhibhava Scheme: Farmers to Receive Direct Cash Benefit by Diwali
Annadata Sukhibhava Scheme: Farmers to Receive Direct Cash Benefit by Diwali

అక్టోబర్ నెలలో దీపావళి పండుగకు ముందు, సుమారు అక్టోబర్ 18, 2025న ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా (DBT) జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదలైనప్పుడే అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున, రైతన్నలకు ఒకేసారి ₹7,000 అందుతాయి. ఈ నగదు బదిలీ దాదాపు 47 లక్షల మంది రైతు కుటుంబాలకు అక్టోబర్ పండుగ సీజన్‌లో పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది

గమనిక: అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల తేదీపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం అక్టోబర్ 18, 2025న నిధులు జమ అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news