ఆపరేషన్ వాలెంటైన్’లో రుహానీ శర్మ లుక్ అదిరింది కదా ….!

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్  మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు. వాస్తవ సంఘటనల స్పూర్తితో తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమా టీజర్‌కి ప్రేక్షకుల మంచి స్పందన వస్తోంది. ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

 

ఇక టాలెంటెడ్ యాక్ట్రెస్ రుహాని శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా మేకర్స్ రుహాని శర్మను తాన్య శర్మగా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎయిర్ ఫోర్స్ పైలెట్ యూనిఫాంలో డైనమిక్ గా కనిపించింది రుహాని శర్మ. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...