జనవరి ఒకటి నుంచి మారిన నిబంధనలు..భారీ జరిమానా తప్పదు..

-

ప్రతి నెల కొత్త రూల్స్ వస్తాయన్న విషయం తెలిసిందే.. బ్యాంకింగ్ లో అయితే ఎక్కువగా మార్పులు జరుగుతాయి.. గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తదితర రంగాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. అదే విధంగా జనరవరి 1 నుంచి కొత్త రూల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారుల ఇలాంటి విషయాలను ముందస్తుగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే నిబంధనలు తెలుసుకోకపోతే ఆర్థిక నష్టాలతో పాటు సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. మరి జనవరి 1 నుంచి ఎలాంటి నిబంధనలు మారుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జనవరి 2023 నుంచి ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా మరింత ప్రీయం కానుంది. ఇన్సూరెన్స్‌ ప్రీయం పెంచేందుకు ఐఆర్‌డీఏఐ పరిశీలిస్తోంది. ఇది కనుకు జరిగితే జనవరి 1 నుంచి ఇన్సూరెన్స్‌ ప్రీమియం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు తప్పకుండా ఈ-ఇన్‌వాయిసింగ్‌ తప్పకుండా జనరేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది…ఇది తప్పనిసరి..

ప్రతినెల తొలివారంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ వంటి ధరలను సవరిస్తుంటాయి గ్యాస్ కంపెనీలు..గత నెలలో సిలిండర్‌ ధరలు భారీగా తగ్గాయి.. ఈ నెలలో వాటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తుంది..జనవరిలో ధరలు పెరగడమో లేదా తగ్గడమో జరుగుతుంటుంది. ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో ఈ ధరలు పెరిగాయి..

క్రెడిట్‌ కార్డులు వాడుతున్నవారు రివార్స్డ్‌ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవడం అనేది చేస్తుంటారు. ఈ ఏడాది డిసెంబర్ లోగా వాటిని రిడీమ్ చేసుకుంటేనే మంచిది. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల గురించి చాలా బ్యాంకులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. పాయింట్లను తగ్గించే అవకాశం ఉంది..అందుకే ముందుగా వాటిని తీసుకోవడం మంచిది..

వాహనాలకు సంబంధించిన హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ ఏర్పాటు చేసుకోకుంటే ఈ పని త్వరగా చేసుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు..నెంబర్ ప్లేట్ లేకుంటే మాత్రం 5 వేలకు పైగా ఇవ్వాల్సిందే..

జనవరి 1 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్‌ కార్డుల విషయంలో కొత్త రూల్స్‌ వచ్చే అవకాశం ఉంది. వాహనదారులకు సంబంధించి కూడా కొత్త నిబంధనలు రానున్నాయి…అదాయపు పన్ను ఈ విషయం కీలక నిర్ణయాలను తీసుకుంటుందని తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version