మగువలకు షాక్‌.. బంగారం ధరలకు రెక్కలు

-

రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా ఊహించని విధంగా బంగారం ధర పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. నేడు పది గ్రాములకు ఏకంగా రూ.250 వరకూ బంగారం ధర ఎగబాకింది. నేడు వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.50,600 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.55,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.71,300 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,300 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.50,600 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.55,200 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,300 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version