రన్ బీర్ కపూర్ ‘రామాయణ’ మూవీ ఫొటోలు లీక్!

-

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ రామాయణ ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని ఎదురుచూస్తున్నారు. రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.అయోధ్య యువ రాజుగా సాంప్రదాయ దుస్తుల్లో రణ్‌బీర్, యువరాణి సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంటున్నారు.తాజాగా ‘రామాయణ’ సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీతారాములుగా ఇద్దరు బాగా సెట్ అయ్యారని, ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ విజయం సాధించడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. షూటింగ్ జరుగుతుండగా తీసిన ఫొటోలు లీక్ అయినట్లు తెలుస్తోంది. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్’ హీరో యశ్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. మొత్తం మూడు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం మొదటి భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news