ఉద్దేర మాటలు తప్ప నాలుగు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు : కేటీఆర్

-

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు గ్రాండ్‌గా జరుపుకునేందుకు వీలు లేకుండా పోయిందని..ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్లీనరీ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ 24 ఏళ్లుగా తన మనుగడ సాగిస్తోంది అంటే గొప్ప విషయమన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో గెలవడానికి రేవంత్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, చేవెళ్ళ పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జి అని చెప్పి మార్చుకున్నారని సెటైర్ వేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం నడుస్తోందని అన్నారు. ఉద్దేర మాటలు తప్ప నాలుగు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతుబంధు, పంటలకు బోనస్, నిరుద్యోగులకు భృతి, ఫ్రీ స్కూటీ, తులం బంగారం అన్నారు ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. ఒక్కసారి మోసపోయాము.. రెండోసారి మోసపోతే మన తప్పు అవుతుందని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news