ఉక్రెయిన్ లోని “ఖేర్సన్” పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది రష్యా ఆర్మీ. ప్రస్తుతం రష్యా సేనల అధీనంలో ఉక్రెయిన్ లోని “ఖేర్సన్” పట్టణ కేంద్రం ఉంది. ఇవాళ ఉదయం నుంచే దాడుడు ప్రారంభించిన రష్యా….“ఖేర్సన్” పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. అటు అజోవ్ సముద్ర తీరంలోని కీలక “మరియుపోల్” ఓడ రేవు చుట్టుముట్టాయి రష్యా సేనలు. అటు ఉక్రెయిన్ దేశాన్ని, ప్రజలను, దేశ చరిత్రను ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రష్యా ప్రయత్నం చేస్తుందని నిందిస్తున్నాడు అధ్యక్షుడు జెలెన్ స్కీ.
రష్యా దాడుల తర్వాత ఇప్పటి వరకు సుమారు 9 లక్షల మంది ఉక్రేయిన్ ప్రజలు దేశాన్ని వీడి వెళ్ళారని పేర్కొంది ఐక్యరాజ్య సమితి. కాగా.. ఉక్రెయిన్ కు మరోసారి షాక్ ఇచ్చింది భారత్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికపై మరోసారి తన తటస్థతను పాటించింది. యూఎన్ఓ ప్రవేశపెట్టిన తీర్మాణానికి మరోసారి ఓటింగ్ దూరంగా ఉంది. ఇటు రష్యాకు, అటు ఉక్రెయిన్ కు సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉంది. 193 సభ్య దేశాలు కలిగిన సభలో 141 దేశాలు తీర్మాణానికి అనుకూలంగా ఓటేయగా.. 5 దేశాలు వ్యతిరేఖంగా ఓటేశాయి.