షాకింగ్‌: ఉక్రెయిన్‌ మహిళలను రేప్‌ చేసేందుకు రష్యా సైనికులకు వయాగ్రా

-

గత 7 నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తూనే ఉంది. అయితే.. ఇప్పటికే ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యా అక్రమించుకుంది. అదే
సమయంలో.. ఉక్రెయిన్‌ పౌరులపై కూడా రష్యా బలగాలు దాడికి దిగుతున్నాయి. అంతేకాకుండా.. ఉక్రెయిన్‌ మహిళలపై రష్యా సైనికులు అత్యాచారాలకు తెగబడుతున్నారు. దీనికి సంబంధించి కొందరు ఉక్రెయిన్‌ మహిళలు, యువతులు తమను రష్యా సైనికులు బెదిరించి ఒంటరిగా, సామూహికంగా రేప్‌ చేశారంటూ ఆరోపణలు కూడా చేశారు. అయితే.. తాజాగా ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారం కోసం రష్యా తన సైనికులకు వయాగ్రా ఇస్తున్నదని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రతినిధి ఆరోపించారు.

బాధితులను అమానవీయంగా మార్చే ఉద్దేశపూర్వక వ్యూహమని విమర్శించారు. లైంగిక హింసపై యూఎన్‌ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్, ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు శనివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్‌ మహిళలపై రష్యా సైనికుల అత్యాచారాలు ఆ దేశ సైనిక వ్యూహంలో ఒక భాగమని ఆమె ఆరోపించారు. రష్యా సైనికుల వద్ద వయాగ్రా మాత్రలు ఉన్నట్లు బాధిత ఉక్రెయిన్‌ మహిళలు సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఇది స్పష్టమవుతున్నదని అన్నారు. ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారాలు చేయాలని తన సైన్యానికి రష్యా చెప్పడంతోపాటు దీని కోసం వారికి వయాగ్రా మాత్రలు కూడా ఇచ్చిందని ఆమె దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version